Categories
మనదేశంలో దీపాలు వెలిగించే పండుగలు జరుపుకొనే సంప్రదాయం ఉన్నట్లే ఎన్నో దేశాల్లో కూడా ఉంది . ఇంటా బయట ఊరు వాడా దీపాలతో అలంకరించే సంప్రదాయం మయన్మార్ లో ఉంది థేరవార్ బౌద్ధానికి నిలయమైన మయన్మార్లో ఈ దీపాల పండగ మూడురోజుల పాటు జరుపు కొంటారు . ధాడిం గ్యుత్ పేరుతో జరుపుకొనే పండగ పున్నమి నాడు నిర్వహిస్తారు . బుద్ధుడు ఈ రోజే స్వర్గం నుంచి దిగివచ్చాడని నమ్ముతారు . తమ ఇష్ట దైవానికి స్వాగతం పలుకుతూ ఈ tazannngdaing పెస్టివల్ జరుపుకొంటారు . ఈ పండుగకోసం వెలిగించే దీపాల్ని చూసేందుకే ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్ట్ లు వస్తారు .