నాకు కోపం ఎక్కువనే ప్రచారం జరిగిపోయింది . కానీ నా కోపానికి అర్ధం ఉంది అంటోంది కంగనా రనౌత్ . చెప్పాలనుకున్న విషయాన్నీసూటిగా చెపుతాను కనుక ఎవరికీ నచ్చదు . కానీ నా కోపం నిర్మాణాత్మకంగా ఉంటుంది . నా ప్రతి మాట వెనుక ఓ దూరదృష్టి ,ప్రణాళికా ఉంటాయి . నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన దానివల్ల మంచే జరిగింది . మనల్ని వెనుక్కి లాగే పద్ధతులకు నేనెప్పుడూ వ్యతిరేకమే అంటోంది కంగనా రనౌత్ .