అద్దెకు డిజైనర్స్ దుస్తులు ప్రఖ్యాతి డిజైనర్  దుస్తులు కొనాలంటే యాభై వేలు పనే ఉంటుంది . అవి ధరించాలనే సరదా తీరాలంటే స్టేజ్ త్రీ వెబ్ సైట్ లోకి వెళ్ళి డ్రస్  సెలక్ట్ చేసుకొని అద్దె చెల్లిస్తే చాలు . ముంబయి కేంద్రంగా సబేవా పూరి సంచిత ఓమేజా 2017లో ఈ సంస్థ ప్రారంభించారు . వీరి దగ్గర వివాహం దగ్గరనుంచి అన్ని శుభకార్యాలకు సరిపోయే చీరెలు షేర్వాణీలు ,అనార్కలి డ్రస్లు ,లెహంగాలు కుర్తీ పై జామాలు . వీటి అద్దె రోజుకు వెయ్యి నుంచి పదివేలు వరకు ఉంటుంది . దేశ వ్యాప్తంగా నెలకు ఇరువై వేల మంది వారి సేవలను ఉపాయోగించు కొంటున్నారు .  దుస్తులతో పాటు జ్యువెలరీ అద్దెకు ఇస్తారు . ఎవరి దగ్గరైన డిజైనర్  దుస్తులు  ఉంటే వీరి సాయంతో అద్దెకు ఇవ్వచ్చు .

Leave a comment