Categories
అంతర్జాతీయ అధ్యయనాల్లో ఈ ప్రపంచలో ఎక్కువ మంది ఇష్టపడే రంగు నీలం అని తేలింది. గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇదే చెపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తాంగా ఈ రండగుని 40 శాతం ఇష్టపడుతున్నారు.నీలం తరువాత అందరూ మెచ్చే రంగు ఎరుపు,ఆకుపచ్చ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.అయితే చాలా మంది చెప్పుకొంటున్నట్లు శాంతికి రూపంగా ఎంచుకొనే తెలుపు దానితో పాటు ఆరెంజ్ ,పసుపు మాత్రం ఆఖరి స్థానాల్లో ఉన్నాయి. నీలం రంగు విశ్వాసం ,నిష్ఠ వ్యవవస్థీకృతం ,ప్రశాంత ధైర్యాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఇష్టపడే వాళ్ళు కూడా దయా,ఆశాభావం కలిగి ఉంటారట. ఈ విషయం అలా ఉంచి రంగుల మనస్సుని ప్రభావితం చేస్తాయట. అందుకే గృహాలంకారణలో వాడే వస్తువుల్లో, ధరించే దుస్తుల్లో రంగులు ఎంచుకోవటంలో శ్రద్ద ఉండాలి.