చట్టం మహిళలకు కోసం ఎన్నో వెసులుబాట్లు కల్పించింది . వారికీ ఏ రకమైన శారీరక మానసిక ఇబ్బంది కలిగించినా ,లైంగిక పరమైన చేష్టలతో విసిగించిన దాన్ని చట్టం లైంగిక వేధింపుగానే పరిగణిస్తుంది . రాజ్యాంగం లోని 14,15 అధికారణాల ప్రకారం పురుషుల తో పాటు మహిళలకు సమన మైన హక్కులు ఉన్నాయి . మహిళలపై ఎలాటి వేదింపులు జరిగినా రాజ్యాంగం వారికీ కల్పించిన సమానత్వ హక్కులను ఉల్లంఘించటం గా పరిగణిస్తుంది .  రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి వేదింపులు లేని సురక్షితమైన వాతావరణంలో వారికీ నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకొనే హక్కు కూడా మహిళలకు ఉంది . ఈ ఒక్క చట్టాన్నయినా గౌరవిస్తే చాలు స్త్రీలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖవంతం చేసుకోగలరు .

Leave a comment