Categories
రోజులో 24 నిమిషాలు తగ్గకుండా నడిస్తే గుండెకు,మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వీటికి సంబంధించిన సమస్యలు సంవత్సారాల తరబడి రాకుండా ఉంటాయంటున్నారు పరిశోధకులు. మొనోపాజ్ దశకు వచ్చాక కొందరికి గుండె జబ్బులు రావటం సహజం .దానికి కారణం ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం,ఆ సమస్య రాకుండా ఉండాలంటే శరీరాన్ని వీలైనంత చురుగ్గా ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవాలి.అధిక బరువు కూడా సమస్యలకు కారణమే కనుక ,శరీరంలో అదనపు కేలరీలు కరిగించుకొనేందుకు నడవాలనీ ఎంత దూరం నడిస్తే ఎన్ని కాలరీలు ఖర్చు అవుతాయన్న విషయం చూసుకొని నడక సమయం ఫిక్స్ చేసుకోమంటున్నారు.