కొత్త లో శ్రద్దగా ప్రాక్టిస్ చేస్తే నెయిల్ ఆర్ట్ పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు. ఎన్నో వీడియోలు కూడా నెట్ లో చూడొచ్చు. గోళ్ళు నీట్ గా కట్ చేసి బేస్ కోట్  అప్లయ్ చేయాలి. 2 ఇన్ 1 బేస్ వాడి టాప్ కోట్ లేదా స్ట్రెయిట్నింగ్ బేస్ కోట్ వేసుకోవచ్చు. గొళ్ళకు పాలిష్ వేసే ముందు బాటిల్ ను కనీసం పది సెకండ్లయినా షేక్ చేయాలి. అప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అప్లయ్ చేయాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డాట్స్ పెట్టుకోవాలి. పింక్ కలర్ చాలా బావుంటుంది. డాటింగ్ టూల్ వాడుతూ నీట్ గా చుక్కలు పెట్టాలి. అన్ని చుక్కలు ఒకే రకంగా ఉండక పోయినా పర్లేదు. టూత్ పిక్ తో ఎర్రని పాలిష్  లో మంచి పింక్ డాట్స్ లోపల చిన్న చుక్కలు పెట్టి, ఆ పై గ్రీన్ పాలిష్ తో ఆకుల డిజైన్ వేస్తె తెల్లని బేస్డ కోట్ పై ఎరుపు గులాబీ చుక్కల అందం కనబడుతుంది. బాగా అలవాటైయ్యాక క్రియేటివ్ గా అలోచించి కొత్త డిజైన్ లు ట్రై చేస్తే బావుంటుంది.

Leave a comment