Categories
WhatsApp

గ్రిల్ ను జాగ్రత్తగా వాడాలి.

గ్రిల్ ను సరిగ్గా వాడుకోవడం తెలిస్తే ఎక్కువకాలం మన్నికగా వుంటుంది. చాలా రకాల గ్రిల్స్ అవుట్ డోర్స్ కు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వుతాయి. కాబట్టి మెటల్ డామేజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రిల్ ఎప్పుడూ కవర్ చేసి వుంచాలి. గ్రిల్ కవర్లు అన్ని షేపుల్లో, సైజుల్లో దొరుకుతాయి. గ్రిల్ కింద మ్యాట్ ఉంచితే పదార్ధాల అవశేషాలు గ్రీజు వంటివి దాని పైన పడతాయి. గ్రిల్ భాగాన్ని రీప్లేస్ చేయడం చాలా అవసరం మాన్యువల్ ని శ్రద్దగా చదివి అర్ధం చేసుకుని ఉపయోగించాలి. ఏడాదికి కనీసం రెండు సార్లు అయినా గ్రిల్ ను శుబ్రం చేయాలి. ప్రతి ఐదు, పది సార్లు వాడకం తర్వాత క్లీన్ చేయాలి. గ్రిల్ మురికిగా వుంటే వాటి జీవిత కాలం తగ్గిపోతుంది. ఆహారం రెండు వైపులా ఒకే సారి కాల్చే బ్రాండ్ తీసుకోవడం బెస్ట్ అలాగే వేడిని సెట్ చేసే గ్రిల్ ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో వేడిని పెంచడం తగ్గించడం చేయొచ్చు. వేసిగా వున్న గ్రిల్ ను అలాగే వదిలి వెళితే ప్రమాదం. చల్లబడిందని నిర్ధారించుకొన్నాక శుబ్రం చేయడం లేదా కదల్చడం చేయాలి. గ్రిల్ పైన వంటకాలు ఇప్పుడు ఎన్నో వెబ్ సైట్స్ లో చూసి నేర్చుకోవచ్చు.

Leave a comment