Categories
ఎన్నో రంగుల్లో కేకులు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ తయ్యారు చేసే యూని కార్న్ టెండొకటి వుంటుంది. ఇప్పుడు దానికి పోటీగా గొత్ ఫుడ్ ట్రెండ్ వచ్చేసింది సోషల్ మీడియా లోకి ఈ గొత్ ఫుడ్స్ అన్నీ బొగ్గు రంగే కొన్ని పదార్దాలను నల్లని నలుపుతో తయ్యారు చేస్తారు. వీటిలో కొబ్బరి చిప్పల్ని కాల్చి ఆ నల్లని మసిని ఆహారంలో చేరుస్తారు. ఈ బొగ్గు పొడి ఎలాంటి రుచితోనూ వుండదు కనుక నష్టం లేదు. లండన్, తైవాన్ లాంటి నగరాల్లో బ్లాక్ పాస్టా, బ్లాక్ హాట్ డాగ్, బ్లాక్ మాకనోర్స్ వంటివి ఇష్టంగా తినేస్తున్నారు. ముంబాయిలోని టిక్కా రెస్టారెంట్ లో చికెన్ టిక్కా, పనీర్ టిక్కాలు నల్లని నలుపులో ఉంటాయిట. ఇప్పుడీ నల్లని ఫుడ్ హాట్ ఫేవరెట్ అయికూర్చుంది.