శరీరంలో నొప్పి భాదిస్తూ ఉంటే ,పెయిన్ కిల్లర్ వేసుకున్నా నొప్పి విసిగిస్తూ ఉంటే ఏదైనా హాస్యంగా ఉంటె పుస్తకం చదువుకోమని ,లేదా స్నేహితుల మధ్య కూర్చుని వాళ్ళతో నవ్వుతు ఏదైనా మాట్లాడమని చెపుతున్నారు శాస్త్రవేత్తలు . నావ్వ్వితే కేంద్ర నాడీవ్యవస్థ లో విడుదలయ్యే ఎండార్షన్ లు మెడంత పాకి నొప్పిని భరించగల శక్తిని ఇస్తాయి . ఈ సహజ సిద్దమైన సైకో యాక్టివ్ రసాయనాల ప్రభావం వల్ల నొప్పులు మంటలు మాత్రవేసుకోనట్లు నెమ్మదిస్తాయి . భరించలేని నొప్పితో ఉన్నపుడు కాసేపు ఏ కామెడీ సినిమా నో చూస్తూ మనసారా నవ్వితే నొప్పి తగ్గుముఖం పడుతుంది అంటున్నారు .

Leave a comment