Categories
WoW

నయా ట్రెండ్ రోజ్ గోల్డ్.

పసుపు పచ్చని  బంగారు నగలు చూశాం, వెండి నగలు చూశాం. చివరకు దారాలతో మట్టి తో చేసిన నగలు వచ్చాయి, ఇప్పుడు కొత్త జ్యూవెలరీ ట్రెండ్ రోజ్ గోల్డ్. ఈ బంగారపు ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి. రోజ్ గోల్డ్ మిశ్రమ లోహాలతో తయ్యారైంది. బంగారంలో రాగి వెండి కలుపుతారు. 18 కారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి, నాలుగు శాతం వెండి వుంటుంది. వెండి  శాతం 5 కన్నా పెంచుతూ పొతే బంగారం రంగు గులాబీ రంగులోకి మారిపోతుంది. స్టడ్స్, ఇయర్ రింగ్స్, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ కలిపినా జ్యూవెలరీ, లేయర్డ్ జ్యూవెలరీగానూ, జడ అల్లినట్లు  కనిపించే బ్రెయిటెడ్ రింగ్స్, చేతి గడియారాలు రోజ్ గోల్డ్ లో దొరుకుతున్నాయి. ఒక్క సారి ఇమేజస్ చుస్తే వారిటీలు కనిపిస్తాయి.

.

Leave a comment