Categories

మొహం కంటే మెడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు బాదం పప్పులు రాత్రివేళ నానబెట్టి పొద్దుటే మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి దాని మెడ చుట్టూ రాసి ఆరిపోయాక కడిగేయాలి. అలాగే కీర చర్మకణాలను రిపేర్ చేస్తుంది కనుక తురిమిన కీర ను మెడకు పట్టించి మృదువుగా మర్దన చేస్తే చాలు అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేయాలి. అలోవెరా జెల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నీళ్లలో కలిపి పేస్టులా చేసి మెడకు పట్టించి, ఆరే వరకూ ఆగి నీళ్ళతో కడిగితే మెడ నలుపు పోతుంది.
|
|