నిరంతరం మనస్సులో కలిగే వ్యతిరేక ఆలోచనలు వ్యక్తిత్వన్ని దెబ్బతీస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజు యాభైవేలుకు పైగా ఆలోచనలు మెదడులో కలుగుతుంటాయి. దానిలో 80%నెగిటివ్ ఆలోచనలు వుంటాయి. అందరు చెప్పినట్లు మనం ఆవేదనలు అదుపులో వుంచుకోగలమని ? మనము ఏ ఆలోచన అయిన అదుపులో వుంచుకోవాలి అని అనుకోకూడదు. ఆలా అదుపు చేయాలని అనుకొన్నప్పుడు అవే ఆలోచన 10%ఎక్కువై అవే ఆలోచన పదేపదే వస్తుంటాయి. మనస్సులో ఒక వ్యతిరేక ఆలోచన వస్తే ,దానితోపాటు మరియొక ఏడూ,ఎనిమిది నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనవల్ల మనుషులు నేను చెయ్యలేను ఏమొ నాకు చేతకాదేమొ,నా కర్మ యింతేనేమో అనే భావాలు మనిషిని నిర్విర్ణం చేస్తాయి. జీవితంలో కలిగే చేధు అనుభవాలు మనిషిని మరింత పనికిరాకుండా చేస్తాయి మరి యిలాంటి ఆలోచనలు మనకు రాకుండా ఏలా నయం చేసుకోవాలి ? ఏదైనా వ్యతిరేక ఆలోచన వచ్చినప్పుడు దానికి ప్రతి స్పందించకూడదు. ప్రతి స్పందించకుండా వుంటే 80% వ్యతిరేక ఆలోచనలు రావు. యింకొక మార్గము ఏమిటంటే బల్ల మీద చేతితో గట్టిగా కొట్టి “stop” అని అనాలి. నిరంతరం మనిషి గతం గురించిగాని,ఫ్యూచర్ గురించిగాని ఎక్కువ ఆలోచించకూడదు. వర్తమానంలో ఎక్కువ గడపాలి. యిటువంటివి పాటించితే వ్యతిరేఖ ఆలోచనలకు దూరంగా వుంటారు.

K. వినోద్ కుమార్
 క్లినికల్ సైకాలజిస్టు
  హైదరాబాద్…ఫోన్ నెం : 9398141041             

 

Leave a comment