ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సు నేలపైన విరిసినట్లే అనిపిస్తుంది . చైనాలోని జాంగెరు డాంక్సే లాండ్ ఫామ్ జియోలాజిక పార్క్ చూస్తే చూసినంతమేరా ఒక చిత్రకారుడు శ్రద్దగా గీసిన అందమైన వర్ణ చిత్రంలా రంగుల్లో పరుచు కొన్న పర్వతాలుంటాయి . 322 చదరపు కిలో మీటర్లు విస్తరించిన ఉన్నా ఈ పర్వతాలని 2009 లో యునెస్కా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇవి కొన్ని లక్షల ఏళ్ళక్రితం రకరకాల రంగుల్లో ఉన్న ఇసుక,రాయి ,ఖనిజాలు భూమిలో ఒక చోట పోగయి ఇలా రంగు రంగుల తెరలుగా రుపం పొసుకొన్నాయి . ఈ నేలపై పరుచుకున్న వర్ణాలని చూసేందుకు పర్యాటకులు ఎంతోమంది ఇక్కడకు వస్తారు .

Leave a comment