ఇప్పటికీ ఇళ్ళలో బాలింతల ఆహరం గురించి ఎన్నో నమ్మకాలున్నాయి. ఆపరేషన్ అయితే కుట్లు చీము పడతాయని పప్పు తినొద్దని పెరుగు,పండ్లు తింటే బిడ్డకు జలుబు చేస్తుందని బాలింతలు కారంపొడి తినాలని పెద్దవాళ్ళు చెబుతారు. కాని డాక్టర్లు బాలింతకు 600 కేలరీల శక్తి అవసరం అంటారు. తల్లిపాల ద్వారానే బిడ్డ శారీరకంగా మానసికంగా ఎదుగుతుంది. తల్లి పౌష్టిక ఆహారం తప్పక తినాలి. ఆహారంలో అన్నం పప్పు అన్ని రాకాల కూరగాయలు,మాంసా హారులైతే మాంసం తీసుకుంటేనే తల్లి త్వరగా తేరుకుంటుంది. బిడ్డకు పాలు ఉంటాయి. రెండు గ్లాసుల పాలు,నీళ్ళు,,అన్నం,చపాతి,పప్పు,,పెరుగు,మెంతి కూర వంటివి తప్పక తినాలి మసాలాలు జంక్ ఫుడ్ వద్దు.

Leave a comment