Categories
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాయిద్యకారులు పేరుపొందిన కోలెట్టే మేజ్ 107 ఏళ్ళ వయసులో తాజాగా 70 ఏళ్ళ కొడుకు తో కలిసి కొత్త ఆల్బం విడుదల చేసింది. గత 15 సంవత్సరాలుగా రోజుకు ఎనిమిది గంటలు పియానో వాయించి రికార్డ్ చేసి సౌండ్ ఇంజనీర్ సాయంతో ఆల్బమ్ గా మారుస్తోంది. సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన భావోద్వేగాలతో కూడుకొన్న మధ్యమం. ప్రకృతి భావోద్వేగాలు ప్రేమ కలలు ఆశలు వంటి వాటన్నింటికీ సంగీతమే ఆత్మీయ ఆహారం లాగా పనిచేస్తుంది. అందుకే నేను సలాడ్ తినేందుకు కష్టపడే కంటే పియానో వాయించేందుకు, మ్యూజిక్ కంపోజ్ చేసేందుకే ఇష్టపడతాను అంటారు కోలెట్టే మేజ్.