అలల్లా తలే కేశాలను ఆలా వదిలేస్తే అందం అంటారు అమ్మయిలు. ఈ అందమైన కేశాలకు అందమైన మెటాలిక్,బ్రాంజ్,సిల్వర్, ఆక్సిడైజ్ట్ గోల్డ్ క్లిప్స్ చాలా అందం తీసుకువస్తాయి. బంగారు వెండి లోహలే కాకుండా జర్మన్ సిల్వర్ బ్రాస్ తో ఫ్యాషన్ జువెల్రీ వస్తువులు చాలా బావున్నాయి. వీటిలో పూసలు రంగురాళ్ళు కలగలసినవి ,కేవలం వెండి మాత్రమే ఉపయోగించి చేసినవి పొడవాటి క్లిప్ లు ఇండో వెస్ట్రన్ డ్రెస్ కు చాలా చక్కని లుక్ ఇస్తాయి. సాంప్రదాయ వేడుకలలో అయితే ఏ లోహం తో చేసినవి అయినా చాంద్ చాలీ  ఆభరణాలు మరింత ఆకర్షనీయంగా ఉంటాయి. ముఖ్యంగా లూజ్ హెయిర్ కు మరింత అదాన్నిస్తాయి. రాళ్ళూ పూసలు పొదిగిన క్లిప్స్ వేడుక సమయాల్లో సాంప్రదాయ దుస్తుల పైకి చక్కగా నొప్పుతాయి.

Leave a comment