సరదాకో ,విహారం కోసమో ఎన్నో చిత్ర విచిత్ర మైన పోటీలు జరుగుతూ ఉంటాయి . చైనాలో ప్రతి ఏటా ఎర్రని మిరపకాయలు వేగంగా తినే పోటీ జరుగుతుంది జులై నెలలో నిం జియాంగ్ లో ఈ పోటీ పెడతారు . మంచి నీళ్లు అడగకుండా ఎవరు అతివేగంగా తింటారు వారిని విజేతగా ప్రకటించి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇస్తారు . ఆదేశంలోని అత్యంత ఘాటైన మిరపకాయ తినాలి . గుట్టలు గుట్టలు గ పోసిన మిరపకాయల మధ్య వాటిని తినే సాహసం చేయాలి . ఆ ఘాటైన మిరపకాయ తిన్నాక ఏమైన శారీరక ఇబ్బందులు వస్తే మాకేమీ పూచీ లేదు అని ముందే ప్రకటిస్తారు నిర్వాహకులు . ఈ పోటీలో,పాల్గొనేందుకు ,చూసేందుకు కూడా బోలెడు మంది హాజరవుతున్నారు .

Leave a comment