Categories
గృహహింస,వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.ఈ ప్రాజెక్ట్ ప్రకారం కేరళలో ఇక పింక్ కార్లు కనిపిస్తాయి.లేడీ డ్రైవర్,లేడీ కానిస్టేబుల్,లేడీ ఇన్స్ పెక్టర్,వాళ్లే ఉంటారు.ఈ పింక్ కార్లు 24 గంటలు రోడ్లపైన పరిగెత్తుతూనే ఉంటాయి .ఏదైనా సమస్య వస్తే తమ కోసం ఈ వాహనాలు ఇలా వెంటనే పరిగెత్తుకు వస్తాయి అన్న నమ్మకాన్ని స్త్రీలకు ఇచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ .ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణ కు వివిధ మహిళా పోలీస్ దళాలు విధుల్లో ఉన్నాయి .ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ద్వారా స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీస్ ఆదేశాలు ఇచ్చింది. రోడ్లు, పార్క్ లు, బస్టాండ్ లో వంటి పబ్లిక్ ప్లేసుల్లో, నివాస గృహాలు హాస్టళ్లు వంటి ప్రైవేట్ ప్లేసులు ఫేస్ బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా లో స్త్రీలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ప్రొటెక్షన్ మహిళా దళాలు వెంటనే రెస్పాండ్ అవుతాయి .అలాగే ప్రమాదకరమైన సమస్య అయితే స్త్రీ పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయలని ప్రభుత్వం సూచనలు చేసింది .స్త్రీలకు కష్టం కలిగించే పురుషుల కు గట్టి గుణపాఠం చెప్పే ఈ ప్రాజెక్టు ప్రభుత్వం చెబుతోంది .