Categories

చక్కగా పూలు పూయాలంటే ఉల్లి ఎరువుగా వేయండి అంటారు ఎక్స్పర్ట్స్. రెండు ఉల్లిపాయలను వాటి తొక్కుతో సహా మిక్సీలో మెత్తగా చేసి ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో వేసి మట్టి పైన వస్తే చాలు మొక్కలు ఉల్లి రసాన్ని పీల్చుకుని చక్కని పువ్వులు పూస్తాయి.ఏదైనా వంట మాడిపోయి ఇల్లంతా వాసన వేస్తుంటే ఓ ఉల్లిపాయి అడ్డంగా కోసి పక్కన పెడితే వాసన పీల్చుకుంటుంది.రంగు మారిన చాకులను,ఇతర పరికరాలను శుభ్రం చేసేందుకు ఉల్లిపాయ ముక్క తో రుద్దితే చాలు. పెనం పైన దోసెలు పల్చగా రావాలంటే ఉల్లిపాయి సగం కోసిన ముక్కతో పెనంపై రుద్దాలి.