వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవటం అలవాటు చేసుకుంటే తిన్ననైన శరీరాకృతి ఉంటుంది గంటల కొద్దీ మొబైల్ ఫోన్ లోనూ కంప్యూటర్ ముందో తలదూర్చి కూర్చుంటే అదీ కూత బడినట్లు కూర్చుంటే శరీరాకృతికి హాని జరిగినట్లే. కూర్చున్నప్పుడు భుజాలు తుంటి కి సమానంగా ఉండేలా కీ బోర్డు పైన చేతులు పెట్టినప్పుడు మోచేయి తొమ్మిది 90 డిగ్రీల కోణంలో వంగి ఉండేలా భుజాలు వదులుగా ఉండేలా కూర్చోవాలి మోకాళ్ళు 90 డిగ్రీల కోణంలో వంచి, పాదాలు పూర్తిగా నేలకు లేదా ఫుట్రెస్ట్కు ఆనించాలి. ఇది మెడకు మేలు చేస్తుంది. ప్రతి అర గంటకు లేచి కాస్త అటూ ఇటూ తిరగాలి నిలబడినపుడు పాదాల మధ్య కాస్త ఎడం ఉండాలి పాదాలు తుంటి కీళ్లకు భుజాలు సమాంతరంగా ఉండాలి. చుబుకం కిందికి వంగకుండా చెవులు భుజాల మీదుగా ఉండేలా చూసుకోవాలి. కండరాలపై ఒత్తిడి లేకుండా ఉంటుంది కూర్చునే నిలబడే భంగిమ సరిగ్గా ఉంటే శరీరాకృతి ఉంటుంది.
Categories