Categories
కనీసం ఆరుగంటల సేపు గాఢంగా నిద్రపోతే మెదడు చురుగ్గా ఉంటుందంటున్నాయి పరిశోధనలు. మెదడు ఆరోగ్యం గురించి చేసిన పరిశోధనలో భాగంగా వెయ్యిమంది పై ఈ పరిశోధన నిర్వహించి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు వాళ్ళ మణికట్టుకు యాక్టిగ్రాఫ్ అనే పరికరాన్ని కట్టి దీని ద్వారా వాళ్ళు ఎంత సేపు చక్కగా నిద్రపోయారు. అందువల్ల మెదడు ఎంత విశ్రాంతిగా ఉంది పరీక్షించారు. సరిగ్గా నిద్రపట్టక అటుఇటు కదులుతు ఉండేవాళ్ళలో మెదడు పనితీరు సరిగ్గా లేదని క్రమంగా అది వాళ్ళలో మతిమరుపుకు దారితీస్తుందని కనిపెట్టారు. అలాగే షుగర్ వ్యాధి ఉంటే మటుకు మంచి నిద్ర అవసరం అని నిద్ర సరిగ్గా పోకపోతే వాళ్ళలో ఆలోచనశక్తి తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు.