మైండ్ ఫడ్ బ్రీతింగ్ గనుక ప్రాక్టీస్ చేస్తే నిమిషంలో నిద్రలోకి జారుకోవడం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీపరితమైన పని ఒత్తిడి ,జీవన వేగంతో ఆందోళనలో ఉండే వాళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చడం పై దృష్టి పెట్టారు.గుండెల నిండా గాలి పీల్చి వదులుతూ ఉండాలి కదా,ఒత్తిడి కొద్ది ఒక్కోసారి గాలి పీల్చడం కూడా ఆపేస్తూ ఉంటారు.ఇదే పరిస్థితి నిద్రపట్టనివ్వదు.ఆలాంటప్పుడు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర నిటారుగా కూర్చుని నాలుగు సెకన్లపాటు గాలీ బాగా లోపలికి పీల్చుకుని పది సెకన్ల పాటు అలా ఉంచాలి.8 సెకన్ల పాటు బయటకు వదిలేయాలి. దీన్ని కాసేపు ప్రాక్టీస్ చేస్తే వెంటనే నిద్ర రావడం ఖాయం.

Leave a comment