Categories
ఫ్యాషన్ పెరల్ హెయిర్ పిన్స్ ఒక్క సారి చుస్తే ఇలాంటివి లేకుండా అందమైన జడలు ఎలాగ అల్లడం అనిపిస్తుంది. న్యూ డిజైన్ పెరల్ పిన్స్ తో సన్నజాజి పువ్వులు, నక్షత్రాలు, రకరకాల జంతువులు ఆకులు ముద్దొచ్చే గులబీ పువ్వులు, నక్షత్రాలు, రకరకాల జంతువులు, ఆకులు, ముద్దొచ్చే గులాబీ పువ్వులు ఎన్నో వెరైటీలు జుట్టుకు అందం ఇచ్చేట్టు. కొన్నయితే చీకట్లో మెరిసిపోయే బంగారు వన్నెల. వెండి వెన్నెల డిజైన్స్ జుట్టు పొడుగ్గా వున్నా పొట్టిగా వున్నా జడలల్లినా ఈ హెయిర్ పిన్స్ గుచ్చితే చాలు ఎక్కడా లేని అందం. కొన్ని పెల్లి కూతుళ్ళ స్పెషల్ కుడా వున్నాయి. ఎండల్లో జుట్టు మేడపై పడకుండా పైకి కట్టుకోవాలంటే ఈ జడపిన్నులు కొనాల్సిందే.