Categories
మేఘాలయ డి జి పి గా బాధ్యతలు తీసుకున్నారు ఇదాశిషా నోంగ్రాంగ్.ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో డిజిపి గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. మేఘాలయ నుంచి ఐపిఎస్ అధికారి అయినా తొలి మహిళగా కూడా ఇదాశిషా చరిత్ర సృష్టించారు. ఏడేళ్లకు పైగా ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేశారు.ఎన్నో తీవ్రవాద వ్యతిరేక దాడులకు నాయకత్వం వహించారు. డి జి పి గా బాధ్యతలు తీసుకునే నాటికి ఇదా సివిల్ డిఫెన్స్ హోమ్ గార్డ్ విభాగం డైరెక్టర్ గా ఉన్నారు.ముక్కు సూటిగా ప్రవర్తించే తత్వం నిజాయితీని నరనరానా జీర్ణించుకున్న అధికారిగా ఆమెకు ఎంతో గొప్ప పేరుంది.