Categories
ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని ఆరు నెలల పిల్లలకు నీళ్లు ఎక్కువ గా తాగిస్తే వాళ్ళు ఆహారం తినడం మానేస్తారు బరువు పెరగరు అంటున్నారు డాక్టర్లు. పాలు తాగే వయసు కాబట్టి వాళ్లకు కావలసిన హైడ్రేషన్ పాలలోనే లభిస్తుంది. కనుక వాళ్ళకు సెమీ సాలిడ్స్ ఇవ్వాలి జావా వంటివి తగ్గించాలి. తల్లి పాలే తాగించాలి. నెలల పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కనుక దాన్ని మొత్తం నీళ్లతో నింప కూడదు. వేసవిలో దాహం ఎక్కువ కనుక బాటిల్ లో నీళ్ళు నింపి ఇస్తే మొత్తం తాగేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి నీళ్లలో కేలరీలు ప్రొటీన్లు ఉండవు కనుక వట్టి నీళ్ళతో వాళ్లకు పోషకాలు అందవు.