గోద్రెజ్ వ్యాపార కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరిక హోల్కర్.గోద్రెజ్ అండ్ బోయ్స్ లో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. జంషెడ్ గోద్రెజ్ సోదరి స్మిత గోద్రెజ్ కూతురు.ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంతరావు హోల్కర్ ను పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలంగా ఇంజినీరింగ్ ఫోకస్ట్ మ్యాను ఫాక్ట్ రింగ్ కంపెనీ లో కీలక బాధ్యతలు తీసుకున్న నైరిక ను న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తారు. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారత కు పెద్దపీట వేయటం వరకు కంపెనీ లో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది నైరిక హోల్కర్. లీగల్ వర్క్ ఏ జెడ్ బి అండ్ పార్ట్నర్స్ తో కెరియర్ ప్రారంభించిన నైరిక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు ప్రత్యేక సలహాలు ఇస్తుంది.

Leave a comment