నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఒక పద్దతి. ఇది మాన పట్ల మనకి వున్న నమ్మకం ఎక్కువ చేస్తుంది. ప్రతి నిమిషం సంతోషంగా వుండటం లో ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం సంతోష పెట్టుకునేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తాం. ఏది సంతోషం ఇవ్వగలదో కనిపెడదం. ఇతరుల తో ప్రేమగా వుండటం లో సంతోషం దొరికితే ప్రేమిస్తాం. కొత్త విషయాలు తెలుసుకోవడం బావుంటే తలుసుకుంటాం. ఆటలు ఇష్టమైతే ఆడతాం. బలహీనతలు వదులుకోవడం ఇష్టమైతే వైలేస్తాం. ఏదైనా చేస్తున్నాము అంటే ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం అవన్నీ చేస్తామని చేయగలమని తెలుసుకోవాలి. అంటే కానీ ప్రతి నిమిషం విలువైనది ఎలా సంతోషిస్తాం అంటే ఇలాగే చేసే పనుల్లో మన చర్యల్లో, మన భావాల్లో, ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే దిశగా నడుస్తాం. ప్రతి నిమిషం విలువైనదే మరి దాన్ని అపురూపంగా అనుభవించాల్సిందే కదా!!
Categories
Nemalika

నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం

నీహారికా,

ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఒక పద్దతి. ఇది మాన పట్ల మనకి వున్న నమ్మకం ఎక్కువ చేస్తుంది. ప్రతి నిమిషం సంతోషంగా వుండటం లో ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం సంతోష పెట్టుకునేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తాం. ఏది సంతోషం ఇవ్వగలదో కనిపెడదం. ఇతరుల తో ప్రేమగా వుండటం లో సంతోషం దొరికితే ప్రేమిస్తాం. కొత్త విషయాలు తెలుసుకోవడం బావుంటే తలుసుకుంటాం. ఆటలు ఇష్టమైతే ఆడతాం. బలహీనతలు వదులుకోవడం ఇష్టమైతే వైలేస్తాం. ఏదైనా చేస్తున్నాము అంటే ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం అవన్నీ చేస్తామని చేయగలమని తెలుసుకోవాలి. అంటే కానీ ప్రతి నిమిషం విలువైనది ఎలా సంతోషిస్తాం అంటే ఇలాగే చేసే పనుల్లో మన చర్యల్లో, మన భావాల్లో, ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే దిశగా నడుస్తాం. ప్రతి నిమిషం విలువైనదే మరి దాన్ని అపురూపంగా అనుభవించాల్సిందే కదా!!

Leave a comment