Categories
ఎక్సర్ సైజుల్లో నేపర్ సైజ్ అని ఒక కొత్త ఎక్సర్ సైజ్ కనిపెట్టాడు లండన్ లో డేవిడ్ లాయిడ్ జిమ్ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడేమి థ్రెడ్ మిల్ ,డంబెల్స్ పని వుండవు . చక్కగా మంచాలుంటాయి నేపర్ సైజ్ అంటే కునుకు తీయటం అన్నమాట. మా జిమ్ కు వచ్చి ఓ 45 నిముషాలు ఆలా పడుకోండి . కేలరీలు తగ్గిపోతాయి అంటున్నారు జిమ్ నిర్వాహకులు చక్కగా పడుకొని మ్యూజిక్ వింటూ రిలాక్స్ అయితే ఒత్తిడి తగ్గిపోతుంది . అలాగే కేలరీలు కరిగిపోతాయట . మరి గంటల కొద్దీ శ్రమపడి పరుగులు తీసి కష్ట పడకుండా . ఈ కునుకు తీయటం బావుంది కదా!