చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు, మిటాయిలు తయ్యారు చేస్తారట. మనకైతే చింతపండు లేని వంటకం అసాధ్యం సాంబారు, చారు, పులిహోర, నిల్వ పచ్చళ్ళు అన్ని చింతపండు మయం. చింత చిగురు పప్పు, పచ్చడి నోరురిపోయెంత రుచి. సైనస్ వున్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ వున్న వాళ్ళకి చింతపండు బదులు టొమాటో, నిమ్మ, వాడమంటారు కానీ పరిశోధనలు అంత అవసరం లేదనే చెపుతున్నాయి. ఇందులో టార్టారిక్ ఆమ్లం, లియోనిన్ జెరానియోల్, శాప్రోల్, సినామిక్ ఆమ్లం, మిధైల్ శాలిసిలైట్ వంటి ఫ్లైటో కెమికల్స్ ఓషధాల్లా పని చేస్తాయి. ఇందులో ఎన్నెన్నో పోషకాలున్నాయి. కొన్ని మందుల్లోనూ చింతపండు నుంచి తీసిన పదార్ధాలు వాడతారు. కాలేయం పని తీరుని, జీర్ణ క్రియ పెంచుతుంది. ఉగాది పచ్చడి తో సహా చింతపండు ఆరోగ్య ప్రదాయకం నిష్యంతగా వాడదగ్గది.
Categories