మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్ పస్ట్లు వాడినా నోరు దుర్వాసన వస్తూనే వుండవచ్చు. నోటి మూలల్లో దాకున్నబాక్టీరియా వల్లనో, ఆహారపు అలవాట్లు, హాబీలు కారణం ఏదైనా కావొచ్చు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఇక మనవల్ల కాకపోతే ఇక డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనర్ తప్పని సరిగా వాడటం, ఆహారం తీసుకున్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం. ఇవన్నీ సాధారణంగా చేసేవే కనుక ఇంకా కొన్ని ఆలోచించుకోవాలి. చాల సేపు మాట్లాడకుండా వుంటే నోరు డ్రై గా అయిపోతుంది. దుర్వాసన వస్తుంది. అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ వుండాలి. చిగుళ్ళు బలహీన పడ్డా ఈ ప్రొబ్లెంస్ తప్పవు. ఇక దంతాల పటుత్వం తోనే ఆ సమస్య పోతుంది. పోషకాహరం తిసుకోవాలి డైట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండాలి. కనీసం ఆరు నెలలకొ సారి దంత వైధ్యుల్ని చూడాలి.
Categories