నాకు ఏ హీరో తో నటిస్తున్నాను ,నా పారితోషికం ఎంత అన్న పట్టింపులు లేనేలేవు . కథే నాకుముఖ్యం అంటోంది సాయి పల్లవి . నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి . శృంగార సన్నివేశాల్లో నటించలేను . ముద్దు సీన్లు అస్సలు చేయను . స్క్రిప్ట్ కు ఎంత అవసరం అయినా సరే నేను వాటికీ దూరంగానే ఉంటాను . ఎన్ని కోట్లు ఇస్తానన్నా అలాటి సన్నివేశాలుంటే వద్దంటూనే ఉన్నాను . హాట్ సన్నివేశాలున్నాయని నేనీ మధ్య కొన్ని సినిమాలు  వదులుకున్నాను కూడా . అలాగే  వరసపెట్టి సినిమా చేస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవాలని కూడా నాకు లేదు అంటోంది సాయిపల్లవి .

Leave a comment