యాపిల్ పాపులర్ ఫ్రూట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 750 రకాల యాపిల్స్ ఉన్నాయి. అతి విలువైన యాపిల్ జపాన్ లో పండుతుంది. సెకాయ్ ఇచి అని పిలిచే ఈ యాపిల్ ప్రపంచంలో నెంబర్ వన్. దీని విలువ అక్షరాల 1500 రూపాయలు. రుచి యాపిల్ లాగే ఉంటుంది. కానీ బరువు కిలో వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నెలలు కూడా రంగు రుచి మారదు. ఈ ఆపిల్ ను ఫలదీకరణం నుంచి పెరిగే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పంట చేతికొచ్చాక తేనెతో వీటిని కడుగుతారట. అందుకే రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెపుతారు.

Leave a comment