చర్మం మెరిసిపోవాలని ఎన్నేన్నో క్రిములు వాడుతారు. ఎంతో శ్రద్ధ తీసు కుంటారు. కానీ చర్మాన్ని నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఎంతో ఎక్కువంటున్నారు నిపుణులు. దాని వల్ల రక్త ప్రసరణ జరిగి కండరాలు ఉత్తేజితమై చర్మం మెరిసి పోతుందంటారు . చర్మానికి సున్నితంగా చేసే మసాజ్ వల్ల వృద్దాప్య చాయలు దూరం అవుతాయి. 40ఏళ్లు దాటాకా కళ్ల చుట్టు త్వరగా చర్మం ముడతలు పడిపోతుంది. అలాంటప్పుడు ఈ మర్ధన బాగా ఉపయోగపతుతోంది. చర్మం నల్లగా మారిన, ముఖచర్మం బిగువు సడలిన, ముఖం పై వ్యర్థాలు పేరుకోన్న కళ్ళు అలసటగా ఉన్నా ఏదైనా తేలికైన నూనెతో ముఖాన్ని మర్ధన చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయి.

Leave a comment