నీహారికా,

జీవితానికి అర్ధం వుండాలంటారు. అలా వుండాలనుకుంటే గనుకనే అర్ధవంతమైన లక్ష్యం నిర్దేశించుకుంటారు. దేశాన్ని పరిపాలించే స్ధాయిలో వున్నవాళ్ళయినా సరే రోజుకు 20 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతలా కష్ట పాడేది జీవితానికి ఓ పరమార్ధం ఉండాలనే కదా. జీవితంలో మానకేం కావాలో కోరుకుని ఆ కోరుకున్న అంశంపైన మనస్సు పెట్టి పనిని ఇష్ట పడి వత్తిడిని ప్రేమించేవారు జీవితంలో తారాజువ్వల్లా పైకి ఎగిరినట్లే . డిగ్రీ సంపాదన ఏదైనా కళల్లో ప్రధాన్యత ఏ అంశం నిర్ణయించుకున్నా సరే దాని కోసం కృషి చేస్తుంటే అలసటే రాదు. కింద పడినా లేచి ముందుకు నడుస్తారు. ఎంత బలమైన, స్ధిరమైన అడుగులు వేస్తారంటే వారి మార్గం లోకి ఎవరు రాలేనంత వారీ నిశ్చయాన్ని ఎవ్వరూ కదలించలేనంత బలంగా నిర్ణయించుకున్న మార్గం దిశగా నడుస్తారు. ఫలితంగా సాధిస్తారు జీవితాన్ని అర్ధవంతంగా తీర్చి దిద్దుకోవడం అంటే ఇదే కదా.

Leave a comment