Categories
ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష్ బరాక్. ఆమె తండ్రి సైనిక సైన్యాధికారి ఓమ్సింగ్. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేసిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్ లో చేరింది. తర్వాత కాంబాట్ ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్ గా చేరింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్ రుద్ర, చీతా, ధృవ మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్లాంటి సున్నితమైన ప్రాంతాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఇక్కడ పని చేయడం నా ఆశ, ఆశయం అంటుంది అభిలాష.