త్రిస్సూర్ లో విమలా కాలేజీలో బికాం మొదటి సంవత్సరం చదువుతోంది ప్రియ ప్రకాష్ వారియర్‌. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ లో ఒకే ఒక్క షాట్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకొంది ప్రియ ప్రకాష్ . ఇంత పేరు వస్తుందని ఊహించలేదు . నా ఎక్సయిట్ మెంట్ మాటల్లో ఎలా వివరించాలో తెలియడంలేదు.  మా కాలేజీలో నేనో చిన్న పాటి సెలబ్రెటీ అయిపోయాను. ఇప్పుడు కాలేజీలో అంతా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక వైపు భయం, ఒక వైపు సంతోషం. చదువు పూర్తైయ్యాకా నటనే కేరీర్ గా మలుచుకుంటాను.  ఒక్క వీడియోతో ఇంత పేరు వస్తుందని నేనెప్పుడైనా కలగన్నానా? గత సంవత్సరం మూడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను . వెండి తెరపైన మాత్రం నా మొదటి సినిమా ఇదే అంటోంది ప్రియ ప్రకాష్ .

Leave a comment