Categories
ఇంటికి సంబంధించిన మొదటి ఆకర్షణ మొదటిది నేల . ఇల్లు ఆహ్లాదంగా మనోహరంగా చక్కని ఆహ్వానం పలికేలా ఉండాలి అంటే మంచి ప్లోర్ ఉండాలి . మాములు రాళ్ళు పాతబడి పోయి ఇల్లు పాతగా అనిపిస్తే ఉన్న ప్లోర్ పైనే కొత్తదనం సృష్టించవచ్చు . కార్పెట్ టైల్స్ వాల్ టు వాల్ కార్పెట్ కు ప్రత్యామ్నాయం . ఉన్న ప్లోర్ పైన సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు . పాతది లామినేట్ అయినా కాంక్రీట్ అయినా ఇబ్బంది లేకుండా ఈ టైల్స్ పరుచుకోవచ్చు . ఈ టైల్స్ ఎధేసిల్ నాన్ ఎధేసిల్ అప్షన్లతో స్క్వేర్ బాక్స్ గా దొరుకుతాయి . నైలాన్ కార్పెట్ టైల్ ,అయితే కనీస మాత్రంగా పనితో అయిపోతుంది . త్వరగా పాడైపోదు అందంగా ఉంటుంది . పాతఇంటికి కొత్త సొగసు తీసుకు రావాలంటే ఈ నైలాన్ కార్పెట్ టైల్స్ ఉపయోగించవచ్చు .