ఒక రోజులో ఇల్లు కట్టచ్చు . ఎలా సాధ్యం అంటారా?ఇప్పుడు త్రీడి ప్రింటింగ్ మెషీన్లు వచ్చాయి . ఈ మిషన్ కు తడి సిమెంట్ అందుబాటులో ఉంచుతారు . ముందస్తు ప్రోగ్రాం ప్రకారం నమూనాల ఆధారంగా ఆ సిమెంట్ నింపేస్తూ ఇల్లు కట్టేస్తుంది ఈ మిషన్ . కిటికీలు గుమ్మలకోసం ప్లేస్ వదిలేస్తుంది . గోడలు చక్కగా నున్నగా ఉంటాయి . మనుషుల ప్రమేయం లేకుండా ఇల్లు కట్టేస్తుంది ఈ త్రీడీ మిషన్ . ప్రస్తుతం దక్షణ అమెరికాలో ఈ మిషన్ పని చేస్తోంది . శాన్ ప్రాన్సిస్కో కి చెందిన ఫ్యూజ్ ప్రొజెస్ట్ కంపెనీ ఐకాన్ కంస్ట్రక్షన్ టెక్నాలజీతో ,న్యూ స్టోరీస్ అనే స్వచ్చంద సంస్థతో కలసి ఒక్క రోజులో 50 ఇళ్ళు కట్టేసి రైతులకు ఇవ్వాలని ప్లాన్ చేసింది . ఈ త్రీడి ఇల్లు నిర్మాణానికి అయినా ఖర్చు రైతు నెలవారీ వడ్డీ లేకుండా చెల్లించవచ్చు .