Categories
ఈ నెల మొత్తం కార్తీక దీపాలు వెలిగిస్తునే ఉంటారు . అలాగే దీపదానం కూడా చేస్తారు . వెండి ప్రమిదలో ఆవునెయ్యి వత్తి వేసి వత్తి కి బంగారు తీగ గుచ్చి వెలిగించి ఆ దీపాన్ని దానం చేస్తారు . కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తారు . ఈ సారి ఈ పూజల కోసం చాలా అందమైన వన్ గ్రామ్ గోల్డ్ దీపాలు ,పూజకోసం ఉపయోగ పడే కుంకుమ భరిణలు ,కుందులు,రాళ్ళు పొదిగిన రకరకాల ఆకృతుల్లో కూర్చిన దీప కళికలు వచ్చాయి . విభిన్నంగా డిజైన్ చేసిన ఈ దీపపు కుందులు పైన లక్ష్మీదేవి,గజరాజు వంటి ఆకృతుల్లో రాళ్ళూ పొడిగినవి అమర్చారు . పండగ వేళ్ళలో వీటిలో దీపాలు వెలిగిస్తే పూజా మందిరం వెలిగిపోతుంది .