మంచి సినిమా చూడాలి అనుకొంటే మలయాళం సినిమా Ottal (The Trap ) ఉచ్చు చూడచ్చు. తల్లితండ్రులను పోగొట్టుకొన్న తోమిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ (kuttappayi) తాత వాల్లయప్పచాయి (valley appacha) దగ్గర పెరుగుతూ వుంటాడు. ఒక రోజు తాత మనవడు ఒక ధనికుల ఇంటికి బాతు గుడ్లు ఇచ్చేందుకు వెళతారు. ఆ ఇంటి పిల్లాడి టింకు తో కుట్టప్పాయ్ కు స్నేహం కుదురుతుంది. జిల్లా స్థాయి పోటీలకు టింకు కోసం మట్టితో గాలం వేస్తున్న జాలరి బొమ్మ చేసి ఇస్తాడు కుట్టప్పాయ్. టింకు కుట్టప్పాయ్ కి చదువు చెప్పాలనుకొంటాడు. ఈ లోగ పిల్లలను తీసుకుపోయి బాల కార్మికులుగా చేసే వ్యక్తి కళ్ళు కుట్టప్పాయ్ పైన పడతాయి జబ్బు పడ్డ తాత తన మనవడిని ఆ మోసగాడికే ఇస్తాడు ఆ తర్వాత కుట్టప్పాయ్,తాత ఏమవుతాడు? జిల్లా స్థాయి లో జాలరి బొమ్మకు వచ్చిన ప్రయిజ్ తీసుకొంటూ టింకు ఎందుకు ఏడుస్తాడు. సినిమా చుడండి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో యూట్యూబ్ లో ఉంది.
Categories