Categories
వెండీ, బంగారం తీగల జర్దోసి పనితం చాలా బావుంది. చక్కని సన్నని తీగల తో ఆకులు, పువ్వులు, మధ్యలు మెరిసే రాళ్ళూ, వజ్రాలు, ముత్యాల తో జర్దోసీ వర్క్ చీరలు ఏ కాలానికి లొంగని ఎవ్వర్ గ్రీన్ స్టయిల్ ఇక జర్దోని కలాక్రుతులకైతే లెక్కలేదు. ఒక డ్రాయింగ్ రూమ్ ఖరీదుగా కనబడాలి అంటే సోఫా కవర్లు, కుషాన్ కవర్లు చివరకు టెలిఫోన్ టేబుల్ మ్యాట్ కుడా జర్దోసీ పనితనం తో కనబడ్డాయి. సినిమా సెట్టింగ్స్ తో రాజమహళ్ళ అలంకరణ తో ఇదే కీలకం అయిందా! ఇప్పుడు చూడండి అమ్మాయిల మనస్సు లాకున్నాట్లే జర్దోసీ ఎంబ్రాయిడరీ పనితనం తో మిలమిలా మెరిసిపోయే పడరక్షకులు వచ్చాయి చూడండి. పాదాల అందానికి మెరుగులు దిద్దే ఈ అందమైన ఆర్టిస్టిక్ చెప్పులని తప్పకుండా నెట్ లో చూడండి. వెంటనే ఆర్డర్ ఇచ్చేంత అందంగా వున్నాయి.