Categories

చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే పెదవులు ఎంతసేపు తేమగా కనిపిస్తాయి. పెదవులు పొడిబారి పోయి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. అలాంటప్పుడు షియా బటర్ రాస్తే పగిలిన గాయం మాన్పటమే కాకుండా పెదవులను తేమగా ఉంచుతుంది. అలాగే కలబంద తో చేసిన లిప్ బామ్ కూడా ఇన్ఫెక్షన్ల ని దూరం చేసి నొప్పిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునేముందు మంచి కొబ్బరినూనె రాసినా సరే లేదా తేనె కూడా చక్కని ప్రత్యమ్నామే.