పాలల్లో నీళ్ళు తప్పని సరిగా కలిపే అమ్ముతారు. కానీ నీళ్ళు కలిపినా పాలు పలుచగా అయిపోతాయి. అలా పలుచగా అయిపోకుండాఆ పాలలో యూరియా , పిండి డిటర్జెంట్, అమ్మోనియం  సల్ఫేట్, సోడియం బైకార్బోనేట్ వంటివి కలిపేస్తున్నారని ఎక్స్ పర్ట్స్  హెచ్చరిస్తున్నారు. అలాగే పాల పదార్ధాలు పెరుగు, వెన్నె, కోవా పనీర్, రాబ్డీ వంటి ఉత్పత్తులలో పిండి, వనస్పతి బ్లోటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలిపేస్తున్నారు. చెక్కర వ్యాధి, రక్త పోటు వున్న వాళ్ళకి సగం ముప్పు ఇలాంటి కల్తీ ఆహారం వల్లనే అంటున్నారు. సాధ్యమైనంత వరకు పాలను మరగకాచి తాగటం మాత్రమే చేయగలిగిన పని. మన దేశంలో పాకెట్లలో దొరికే పాలలో 60 శాతంమేరకు కల్తీ పాలేనేని ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆధారిటీ, గత ఎడాది అద్యాయినంలో తేల్చింది. శుభం ఇంక చేసేందుకు ఏముంటుంది. పాలు లేకుండా తినడం అలవాటు చేసుకోవాలి.

Leave a comment