వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె ముక్కుదిబ్బడ ను తగ్గిస్తుంది. వెల్లులి రేకలు తేనె యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తీసుకుంటే బరువు పెరగటం జరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ ఆరోగ్యం బావుంటుంది. తమలపాకులో రెండు మిరియాల గింజలు పెట్టి చుట్టి తినేస్తే ఏడ తెరిపి లేని దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో పసుపు వేసి తాగితే నిద్ర పడుతుంది. దగ్గు కూడా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేని ఈ చిట్కాలు ప్రయోగించి చూడండి . ఫలితం వంద శాతం ఉంటుంది
Categories