నెయిల్ ఆర్ట్ పైన ఇష్టంతో వాటిని తరుచు మారుస్తూ ఉంటే గోళ్ళ పై మరకలు పడతాయి. నెయిల్ పాలీష్ లో ఎసెటోన్, ఎథిల్ లాక్టేట్, తెరప్తాలిక్ యాసిడ్ వంటి అనేక ఇతర రసాయనాలతో,గోళ్ళు పిగ్మెంట్స్ ని గ్రహిస్తాయి. ట్రాన్సపరెంట్ నెయిల్ పాలిష్ ను ఓ కోటింగ్ అప్లై చేసి ఆ తర్వాత గోళ్ళ పై డార్క్ నెయిల్ పాలిష్ వేయాలి. కఠినమైన నెయిల్ పాలిష్ రిమూవర్ లు వాడకూడదు. ఇవి చేతి వేళ్ళ గోళ్ళను పొడి బారేలా చేస్తాయి. కెరోటిన్ కోట్స్ కు హాని కలిగిస్తాయి. ఫాల్స్ ఎక్రిలిక్ నెయిల్స్ పై నెయిల్ ఆర్ట్ మంచి ప్రత్యమ్నాయం. ఫాల్స్ నెయిల్స్ గోళ్ళ ఎదుగుదలను ప్రభావితం చేయవు.