Categories

చర్మం పైన ఎప్పుడు ట్యాన్ ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. ఎండపడే ప్రదేశాలలో చర్మం నల్లబడటం సహజం. సహజమైన మార్గాలతో ట్యాన్ పోగొట్టవచ్చు. శనగ పిండిలో నిమ్మరసం కలిపి మొహం, మెడ, మోచేతుల వరకు పట్టించి ఇరువై నిముషాల తర్వాత మైల్డ్ క్లీనర్ తో కడిగేయాలి. నిమ్మ చక్కతో పంచదార అద్దుతూ ట్యాన్ ఉన్న ప్రదేశంలో రఫ్ చేసిన మంచిదే. పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ ప్యాక్ వేసుకొన్న ఫలితం ఉంటుంది. పంచదార, గ్లిజరిన్, నిమ్మరసం కలిపి స్క్రబ్ చేస్తే ట్యాన్ ఎక్కువగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం, పెరుగు శనగ పిండి అప్లయ్ చేసిన ట్యాన్ పోతుంది.