నీహారికా,
నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని పెట్టుకొంటే ఇంక సమయం ఏమి మిగులుతుంది. కొన్ని పనులు మొదలు పెడతాం ఒక్కోసారి పర్ఫెక్ట్ గా వుంటుంది ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. అది సహజం. సాంకేతిక విజ్ఞానం మన పని త్వరగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఫోన్లు, లాప్ టాప్ లు, పి.సి లు చూస్తాం. కానీ సైడ్ ఎఫెక్ట్ గా, గంటల తరబదిఫోనే సంభాషణలూ, ఈ మెయిళ్ళు, ఫేస్ బుక్ లు సమయం తినేస్తాయి. క్షణం తీరిక లేకుండా పని చేస్తేనే పూర్తవుతుంది అనుకొని అస్తమానం రెస్ట్ లేకుండా పని చేస్తూనే వున్దతమింకో తప్పు. అంచేత కెరీర్ లో గానీ, చదువు లో గానీ కొన్ని రూల్స్ వుండాలి. ఏ పని పర్ఫెక్ట్ గా, కాస్తయినా తేడా లేకుండా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఓసారి ఫెయిల్ అయితే ఇక మన వల్ల కాదు అని చేతులు ఎత్తేయకూడదు. సాంకేతిక విజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవాలి. ఉన్న సమయం వృధా చేయకుండా బాగా వాడుకోవాలి. చదువు లేక ఉద్యోగం మాత్రమే జీవితం కాదు. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ కోసం సమయాన్ని ఫ్రేమ్ చేసుకొని ప్రతి క్షణాన్ని ఆస్వాదించుకోవాలి. రోజూ చేసే పని అయినా సరే దాన్ని మనం ప్రతిసారి శ్రద్దగానే చూసి మంచి ఫలితం సాధించేలా వుండాలి. మొత్తానికి పనిభారంతో కుంగిపోయేపరిస్థితి తెచ్చుకోవద్దు.