Categories
ఏ రోజు పని ఆ రోజు చేస్తే మంచిది అంటారు. కానీ అంతులేని పనులుంటాయి ఇంటా బయటా కూడా. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే గందరగోళం ఉండదు. ఇంట్లో పనులన్ని ఒక్కసారే పెట్టుకోవద్దు. రోజు కొక్కటి చొప్పున ఒక రోజు బీరువాలో బట్టలు సర్దడం అదరా బాదర వెతుక్కునేటట్లు కాకుండా అవసరమైనవి చేతికి అందేలా అమర్చుకోవాలి. అలాగే వంటిట్లో రోజువారి అవసరానికి కావల్సినవి మాత్రమే పెట్టుకోవాలి. మిగతాది అట్టపెట్టేల్లో సర్దేసి పైన ఏ పెట్టేలో ఏ వస్తువు ఉన్నాయో రాసి అతికిస్తే చాలు. అలాగే కూరలు తెచ్చేటప్పుడు వారానికి మొత్తంగా ఏం వండాలో ఆ మెను ప్రకారం తెచ్చుకుని ఆ మెనూ పేపర్ పైన రాసి ఫ్రీజ్ పైన అంటిస్తే ఏ రోజు ఏం కావలో హడవిడి లేకుండా ఉంటుంది.