గర్భం కోసం ప్లాన్ చేసుకొనే మహిళలు ప్రీ నాటల్ చెకప్స్ చేయించుకోవాలి అంటున్నారు వైద్యులు. చాలా మందికి ఓవ్యులేషన్ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. నెలలో గర్భం దాల్చే సమయం 24 నుంచి 48 గంటలు మాత్రమే ఉంటుంది. విడుదలయిన అండానికి 48 గంటల్లో మాత్రమే ఫలదీకరణ ఆవకాశం ఉంటుంది. గైనకాలజిస్ట్ పిల్లల కోసం ప్లానింగ్ చేస్తూ తమవద్దకు వచ్చే వారికి ఓవ్యులేషన్ పట్టిక ఇస్తారు. వారి రుతుక్రమాన్ని బట్టి ఈ టైమ్ టేబుల్ ఉంటుంది. అలాగే గర్భం దాల్చాలి అనుకొన్నప్పుడు ముందుగా బరువు తగ్గాలి అదనపు బరువు లో ఈస్ట్రోజన్ హర్మోన్లు ప్యాట్ లోపల పేరుకుకొని పోతాయి. దీని వల్ల ఓవ్యులేషన్ విడుదల ఆలస్యం అవుతుంది. బిడ్డను మోసేందుకు శరీరాన్ని సిద్దం చేస్తున్నప్పుడు డిటాక్సిఫై చేసుకోవాలి .ఆహారంలో కొద్దీ పాటి మార్పులు కూడా అవసరమే.
Categories